jagan fan: జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే "సచ్చిపోతా" అభిమాని వీడియో !

వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించాడు. సదరు అభిమాని భార్య ఆ వీడియో తీస్తుండగా కొడుకును ఎత్తుకుని ఆ అభిమాని మాట్లాడాడు.

jagan fan: జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే సచ్చిపోతా అభిమాని వీడియో !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ ఎన్నికల్లో జగన్ ( JAGAN) ఓటమిని తట్టుకోలేని ఓ అభిమాని సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఎన్నికలు, సీట్లు , గెలుపులు ,ఓటమిలు నాకుతెలీదు...మా జగన్ అన్న ను సీఎం( CM) చెయ్యండి.. లేదంటే నా భార్య , పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొని సచ్చిపోతా అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని( KOVVURU) గామన్ బ్రిడ్జిపై నిలబడి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి తన ఆవేదనను వీడియో ద్వారా వెల్లడించాడు. సదరు అభిమాని భార్య ఆ వీడియో తీస్తుండగా కొడుకును ఎత్తుకుని ఆ అభిమాని మాట్లాడాడు.

పేదలకు జగనన్న ఎంతో మేలు చేశాడని ఆయన చెప్పాడు. ఎంతోమందికి ఉపకారం చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా ఓడిపోవడం ఏంటని ప్రశ్నించాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, మరొకటని.. ఇలా ఏవేవో అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఇవన్నీ తెలీదు కాని తనకు న్యాయం చెయ్యాలని జగనన్న మళ్లీ సీఎం కావాలని డిమాండ్ చేశాడు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఎన్నికల ఫలితాలపై విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. తన ప్రాణాలు వదిలితేనైనా...ఏపీ పేదలకు మంచి జరిగితే అంతే చాలని వీడియోలో తెలిపారు.



Tags:
Next Story
Share it