Kavvampalli: 'కడియం అడుక్కుంటేనే టికెట్ ఇచ్చినం'

కాంగ్రెస్ వాళ్లే పిలిచి మరీ తనకు టికెట్ ఇచ్చారని ఆమె వెల్లడించారు.

Kavvampalli: కడియం అడుక్కుంటేనే టికెట్ ఇచ్చినం
X

న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె కడియం కావ్య BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరికపై స్పందించిన కావ్య.. ఓ ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లే పిలిచి మరీ తనకు టికెట్ ఇచ్చారని ఆమె వెల్లడించారు.

మరోవైపు కావ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 'తన కుమార్తెకు టికెట్ ఇవ్వాలని కడియం శ్రీహరి అడుక్కుంటేనే ఇచ్చినం' అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరి కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Tags:
Next Story
Share it