KCR focus on elections: పార్లమెంట్ ఎన్నికల వేళ జోరు పెంచిన కేసీఆర్..

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోరు పెంచారు.

KCR focus on elections: పార్లమెంట్ ఎన్నికల వేళ జోరు పెంచిన కేసీఆర్..
X

న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జోరు పెంచారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై కూడా పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు BRS వర్గాలు వెల్లడించాయి. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈరోజు కేసీఆర్ టూర్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కేసీఆర్ పర్యటించనున్నారు. చేవెళ్లలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. అంతేకాకుండా, 15న మెదక్‌లో కూడా బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఎండిపోయిన పంటల పరిశీలనలో భాగంగా ప్రజల్లో తిరుగుతున్న కేసీఆర్.. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి, ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు.

Tags:
Next Story
Share it