Beer:బీరు అసలు ధర ఇంత తక్కువ..తెలిస్తే మైండ్ బ్లాకే.!

ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా చాలామంది మద్యానికి అలవాటు పడుతున్నారు. చిన్నతనంలోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొంతమంది మద్యానికి బానిసలై

Beer:బీరు అసలు ధర ఇంత తక్కువ..తెలిస్తే మైండ్ బ్లాకే.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో వయసుతో తేడా లేకుండా చాలామంది మద్యానికి అలవాటు పడుతున్నారు. చిన్నతనంలోనే అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొంతమంది మద్యానికి బానిసలై కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. అయినా రోజురోజుకు మద్యం దుకాణాల సంఖ్య పెరుగుతుందే తప్ప తరగడం లేదు. అలాగే మద్యం ధరలు ఎంత పెంచిన మందుబాబుల్లో మందగమనం రావడం లేదు. నిండుగా తాగి దండిగా ప్రభుత్వాలకు డబ్బులు అప్పజెప్పుతున్నారు.

అలాంటి మద్యం తాగేవారికి తెలియని ఒక విషయం ఉంది. అదేంటో చూద్దాం. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ నడుస్తోంది. ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో చాలామంది చల్లని బీర్ల వైపే చూస్తున్నారు. అలాంటి బీరు ప్రస్తుతం మార్కెట్ లో 150 రూపాయలకు లభిస్తోంది. ఈ ధర ఉన్నటువంటి 650ml లైట్ బీరు అసలు ధర రూ:40 అట. కానీ ఇది వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి 150 రూపాయలు అవుతోంది. అంటే ఈ బీరుపై 60% పైగా పన్నుల రూపంలో ప్రభుత్వాల ఖజానాకు చేరుతోంది. అంటే ఒక బీరు మీద దాదాపుగా 90 రూపాయలు పన్ను చెల్లించాలి.

అంటే సాధారణంగా ఒక ఫుల్ బాటిల్ తయారీకి 150 రూపాయలు అవుతాయట. కానీ దీన్ని 800 వందల రూపాయలకు అమ్ముతూ ఉంటారు. ఇందులో వైన్ షాప్ 100 రూపాయల మార్జిన్ ఉంటుంది. మిగతా 550 రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికే చెల్లించాలట. ఈ విధంగా మనం తాగే ప్రతి మద్యం బాటిల్ పై ప్రభుత్వం పన్ను వసూలు చేస్తోందని బిజినెస్ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఈ ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బట్టి నిర్ణయించబడుతున్నాయి.మరి దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.

Tags:
Next Story
Share it