Coffee:మేక వల్లే కాఫీ పుట్టిందా..హిస్టరీ తెలిస్తే ఆశ్చర్యమే..!

సాధారణంగా పొద్దున లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇది తాగంది అసలు మార్నింగ్ స్టార్ట్ అవ్వదు. ఇక ఇందులో ఎక్కువ మంది ప్రజలు బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ

Coffee:మేక వల్లే కాఫీ పుట్టిందా..హిస్టరీ తెలిస్తే ఆశ్చర్యమే..!
X

న్యూస్ లైన్ డెస్క్: సాధారణంగా పొద్దున లేవగానే చాలామంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇది తాగంది అసలు మార్నింగ్ స్టార్ట్ అవ్వదు. ఇక ఇందులో ఎక్కువ మంది ప్రజలు బెడ్ మీద ఉండగానే బెడ్ కాఫీ తీసుకున్న తర్వాతే బయటకు వస్తారు. అలాంటి కాఫీ ప్రస్తుతం మానవ జీవితంలో ఒకటిగా మారిపోయింది. అది లేకుండా ఉండలేకపోతున్నారు. మరి ఎంతో రుచిగా, ఎనర్జీ నిచ్చే కాఫీ ముందుగా ఎక్కడ పుట్టింది. ఎవరు తయారు చేశారు అనే వివరాలు చూద్దాం.. కాఫీ ని ముందుగా ఎనిమిదవ శతాబ్దంలో ఆఫ్రికాలో కనిపెట్టారట. దీన్ని కనిపెట్టింది కూడా ఒక మేకల కాపరి అని చాలామందికి తెలియదు. కాపరి మేకలు తీసుకొని ప్రతిరోజు బయటకు వెళ్తుండేవాడు.

అయితే ఒక రోజు మేకలు మేపుకొని ఇంటికి వచ్చేవాడు. అందులో ఒక మేక పిల్ల చాలా డల్ గా ఉండేది. అలా ఓ రోజు మేతకు వెళ్లి వచ్చిన తర్వాత డల్లుగా ఉండే మేక పిల్ల చాలా చురుకుగా ఉండడానికి గమనించాడు. ఆ మరుసటి రోజు కూడా మేకలు మేపుకొని వచ్చిన తర్వాత ఆ మేక పిల్ల మరింత ఉత్సాహంగా గంతులు వేయడం చూసి ఆశ్చర్యపోయాడు. చివరికి మరో రోజు ఆ మేక రోజంతా ఏం మేస్తుంది అనేది గమనించాడు. ఆ మేక అడవిలో ఉండే ఒక మొక్క గింజలను ఎక్కువగా తినడం గమనించాడు. దీన్ని తినడం వల్ల మేక యాక్టివ్ గా తయారవుతుందని ఆ గింజలను కొన్ని తీసుకొని వచ్చి ఊర్లో అందరికీ చూపించాడు. కానీ ఊరివాళ్లు దాన్ని తినడానికి సాహసం చేయలేదు.

చివరికి ఆ మేకల కాపరి ఆ గింజలతో పౌడర్ చేసి నీటిలో కలుపుకొని తాగడం మొదలుపెట్టాడు. ఎంతో రుచిగా ఉండడం గమనించాడు. అంతేకాకుండా అవి తాగిన తర్వాత ఆయనకు యాక్టివ్ గా, చాలా చురుకుదాం అనిపించడంతో , గ్రామస్తులంతా ఆ గింజలను తీసుకొని వచ్చి పౌడర్ గా చేసుకుని ప్రతిరోజు తాగడం మొదలుపెట్టారు. అలా అధి క్రమక్రమంగా కాఫీగా తయారైంది. అలా మొదలైన కాఫీ ప్రయాణం ప్రపంచ దేశాలన్నింటికీ చేరింది. ఇంతకీ ఆ మేక తిన్న గింజలు ఏంటయ్యా అంటే కాఫీ బీన్స్ గింజలట. ఆ విధంగా మేక నుంచి పుట్టుకొచ్చిన కాఫీ, మానవ జీవితంలో ఒకటిగా మారింది.

Tags:
Next Story
Share it