సీట్ బెల్ట్ కనుగొన్నది ఎవరో తెలుసా.. ఇంత చరిత్ర ఉందా.?

ప్రస్తుత కాలంలో రెండు చక్రాల బైక్ మినహా ప్రతి వెహికల్ లో సిట్ బెల్ట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ సీట్ బెల్ట్ ద్వారా ఎన్నో ప్రమాద ఘటనల నుంచి బయట పడుతున్నారు.

సీట్ బెల్ట్ కనుగొన్నది ఎవరో తెలుసా.. ఇంత చరిత్ర ఉందా.?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో రెండు చక్రాల బైక్ మినహా ప్రతి వెహికల్ లో సిట్ బెల్ట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ సీట్ బెల్ట్ ద్వారా ఎన్నో ప్రమాద ఘటనల నుంచి బయట పడుతున్నారు. మరి అలాంటి సీటు బెల్టుని కనుగొన్నది ఎవరు.. అనే వివరాలు చూద్దాం. ముందుగా సీటు బెల్టును కనుగొన్నది సార్ జార్జ్ కేలే.. ఈయన ఒక ఇంగ్లీష్ ఇంజనీర్. ఈయన ముందుగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం అలాగే పైలెట్ల కోసం ఈ బెల్టును కనిపెట్టారట.

19వ శతాబ్దం చివరిలో అభివృద్ధి చేసిన ఈ సీటు బెల్టు కాలక్రమేనా ఎంతో డెవలప్ అయింది. అయితే జార్జ్ కాలే ఈ బెల్టును కనిపెట్టారు కానీ పేటెంట్ మాత్రం దాఖలు చేయలేదట. కానీ దీనిపై అమెరికన్ వ్యక్తి అయినటువంటి ఎడ్వర్డ్ జె . క్లావ్ కార్న్ అనే వ్యక్తి 10, 1985లో మొదటి పేటెంట్ హక్కులు పొందారట. ముందుగా ఈయన సీటు బెల్టును న్యూయార్క్ నగరంలో తిరిగే గుర్రపు బండిలలో ఉపయోగించారట.

ఇక ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ఉండడం గమనించిన వీరు 1950 ఆ తర్వాత కార్ల కంపెనీలు వాహనాల్లో కూడా ఈ బెల్టులను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే క్రమక్రమంగా వాహన భద్రత చట్టంలో సీటు బెల్టు తప్పనిసలైపోయింది. వాహనంలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోతే తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

Tags:
Next Story
Share it