ITR 2024: టాక్స్‌పేయర్లకు గుడ్‌న్యూస్‌ ..'యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌'లో మార్పులు

ఆర్ధిక సంవత్సరం( FINANCIAM YEAR) 2023-24 కోసం ఆదాయపన్ను రిటర్న్ లు దాఖలు చేసే సీజన్( SEASON) కొనసాగుతుంది.

ITR 2024: టాక్స్‌పేయర్లకు గుడ్‌న్యూస్‌ ..యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌లో మార్పులు
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆర్ధిక సంవత్సరం( FINANCIAM YEAR) 2023-24 కోసం ఆదాయపన్ను రిటర్న్ లు దాఖలు చేసే సీజన్( SEASON) కొనసాగుతుంది. పన్ను చెల్లింపులకు ఇన్ కం ట్యాక్స్ విభాగం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంటుంది. ఏడాదికో కొత్త రూల్. తాజాగా, "వార్షిక సమాచార ప్రకటన"లో (Annual Information Statement లేదా AIS) కొత్త ఫీచర్‌ను జోడించినట్లు తెలిపింది.

జీతం కాకుండా ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయాల ‍‌(Income from other resources) గురించి AIS చెబుతుంది. ఫామ్‌-16తో పాటు AISను కూడా చూడడం వల్ల, ఫైలింగ్‌లో తప్పులు జరిగే అవకాశాలు దాదాపుగా తగ్గిపోతాయి. సోర్స్‌( SOURCE) నుంచి అందుకున్న సమాచారానికి సంబంధించిన ఖచ్చితత్వంపై పన్ను( TAX) చెల్లింపుదారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. తప్పుడు రిపోర్టింగ్ విషయంలో, అది ఆటోమేటిక్‌గా( AUTOMATIC) ధృవీకరణ కోసం సోర్స్‌కు వెళుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్‌ ( FEEDBACK) వీలవుతుంది. సమాచార ధృవీకరణ పని ఏ స్థాయిలో ఉందో "స్టేటస్‌"( STATUS) కూడా చెక్‌ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారు రియాక్షన్ బట్టి అందులో ఎంత వరకు నిజముంది అవన్నీ ప్రత్యక్ష పన్నుల కేంద్రబోర్డు ( CBDT) పేర్కొంది.

Tags:
Next Story
Share it