Child:పిల్లలు నిద్రపోయాక పేరెంట్స్ ఇలా చేస్తున్నారా జాగ్రత్త.?

పెళ్లి చేసుకున్న ప్రతి జంట పిల్లల్ని కంటుంది. పెళ్లికి ముందు ఒక లెక్క, పెళ్లి తర్వాత మరో లెక్క, పిల్లలు కలిగిన తర్వాత ఇంకో లెక్క ప్రతి సంసారంలో ఉంటుందనేది

Child:పిల్లలు నిద్రపోయాక పేరెంట్స్ ఇలా చేస్తున్నారా జాగ్రత్త.?
X

న్యూస్ లైన్ డెస్క్: పెళ్లి చేసుకున్న ప్రతి జంట పిల్లల్ని కంటుంది. పెళ్లికి ముందు ఒక లెక్క, పెళ్లి తర్వాత మరో లెక్క, పిల్లలు కలిగిన తర్వాత ఇంకో లెక్క ప్రతి సంసారంలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుత కాలంలో పిల్లల్ని చాలా అల్లార్ ముద్దుగా ఒక్క మాట కూడా అనకుండా పెంచుతున్నారు. వారు ఏది అడిగితే అది క్షణాల్లో తెచ్చి పెడుతున్నారు. దీనివల్ల చాలామంది పిల్లలు సోమరిపోతులుగా తయారవుతున్నారు. ఎప్పుడైనా సరే పిల్లలకి కష్టాలు సుఖ విలువలు చెప్పుకుంటూ పెంచాలని దానివల్లే పిల్లలు తెలివిగా ఎదుగుతారని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పిల్లల ముందు వల్గర్ గా మాట్లాడడం, భార్య భర్తలు ఇద్దరు కొట్టుకోవడం వంటివి అసలు చేయకూడదట. దీనివల్ల కూడా వారి మనసు గాయ పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలు రాత్రి సమయాల్లో పడుకోవడానికి బెట్టు చేస్తూ ఉంటారు. వారిని పడుకోబెట్టడం తల్లిదండ్రులకు పెద్ద సాహసం గానే చెప్పవచ్చు. మరి అలాంటి పిల్లలు పడుకునే ముందు అలాగే పడుకున్న తర్వాత ఈ విషయాలు అసలు మాట్లాడకూడదట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దయ్యాల స్టోరీలు :

ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని నిద్రపుచ్చడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చివరికి వారిని దయ్యాల స్టోరీలు చెప్పి మరి భయపెట్టి నిద్రలోకి తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదట. దీనివల్ల పిల్లలు భయపడిపోయి, మనం ఇంట్లో లేనప్పుడు విపరీతంగా ఆందోళన చెందుతారని అంటున్నారు.

దుఃఖించే మాటలు:

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు నిద్ర పోకుంటే కోపానికి వస్తూ ఉంటారు. వారిని తిడుతూ ఉంటారు. దీనివల్ల పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు పడుకునే ముందు కానీ పడుకున్న తర్వాత కానీ అసలు వారిని ఏడిపించే మాటలు గట్టిగా అరవడం వంటివి చేయకూడదట.

తిట్టడం:

కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు పడుకున్న తర్వాత తిట్టుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఇతర పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా పిల్లలు డిస్టర్బ్ అవుతారని, కాబట్టి పిల్లలు పడుకున్న తర్వాత వారికి వినబడే విధంగా ఎలాంటి పనులు చేయరాదని నిపుణులు అంటున్నారు.

Tags:
Next Story
Share it