Sarpanch:సర్పంచ్ పోటీ చేస్తున్నారా..ఈ అర్హతలు ఉండాల్సిందే..?

ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసాయి. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనికి నోటిఫికేషన్ జూన్ చివరి

Sarpanch:సర్పంచ్ పోటీ చేస్తున్నారా..ఈ అర్హతలు ఉండాల్సిందే..?
X

న్యూస్ లైన్ డెస్క్: ఇప్పటికే తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ ముగిసాయి. ఇక సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనికి నోటిఫికేషన్ జూన్ చివరి వారంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 12,700 గ్రామపంచాయతీలకు ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇదే తరుణంలో ఏ గ్రామంలో ఎలాంటి రిజర్వేషన్ వస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే షెడ్యూల్ ఏరియాలో 1281 గ్రామపంచాయతీలకు, ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. గ్రామపంచాయతీలో ఏ విధమైన రిజర్వేషన్ వస్తుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం. అలాంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంలోని 14(1),15(3)గెజిట్ ప్రకారం వీళ్ళ పదవీకాలం ఐదు సంవత్సరాలు. జిల్లా గెజిట్ లో బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తారు. అభ్యర్థి గ్రామపంచాయతీలో ఓటర్ అయి ఉండాలి. 21ఏళ్ల వయసు నిండి ఉండాలి. పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండరాదు. జైలు శిక్ష అనుభవించిన వారు అనర్హులు. మతిస్థిమితం లేని వారు పోటీకి అనర్హులు. ఐపీ కోసం కోర్టుకు దరఖాస్తు చేస్తున్న వ్యక్తులు కూడా అనర్హులే. ప్రభుత్వానికి చెందిన ఎలాంటి కాంట్రాక్టు పని పొంది ఉండరాదు. గ్రామపంచాయతీ తరఫున పారితోషకం పొందే ప్రాక్టీషనర్ గా ఉండరాదు.

సహకార సొసైటీలో మేనేజర్ లేదా కార్యదర్శిలు పోటీకి అనర్హులు. గ్రామపంచాయతీకి బకాయి ఉన్నా కానీ పోటీకి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగి పోటీలో ఉండరాదు. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా వ్యక్తులు పోటీ చేయడానికి వీలు లేదు. పోటీ చేసే అభ్యర్థికి తప్పక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచే వ్యయ ఖర్చులను ఈసీకి చూపించాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన నాలుగవ రోజు నుంచి పదవరోజు మధ్యలో నామినేషన్ వేయాలి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 మధ్యలో మాత్రమే నామినేషన్ వేయాలి..పోటీ చేసే వ్యక్తి నామినేషన్ పై తప్పక సంతకం చేయాలి. రిజర్వుడు అభ్యర్థులు అందుకు సంబంధించిన పత్రాలు అందజేయాలి. ఈ నియమాలు పాటించకపోతే వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

Tags:
Next Story
Share it