radio day: ప్రపంచ రేడియో దినోత్సవం సంధర్భంగా రేడియో ముచ్చట్లు.

అతి పెద్ద ప్రజాశక్తి రేడియోనే. అలాంటి రేడియోని ...ఎన్నో యేళ్లు , ఎన్నో గొప్ప కళాకారులను అందించిన రేడియోని ఈ రోజు గుర్తు చేసుకుందాం.

radio day: ప్రపంచ రేడియో దినోత్సవం సంధర్భంగా రేడియో ముచ్చట్లు.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రేడియో ( radio) ఇప్పుడంటే రేడియో తెలీని రోజులు వచ్చేశాయి కాని ఒకప్పుడు రేడియోనే అన్నీ. అతి పెద్ద ప్రజాశక్తి రేడియోనే. అలాంటి రేడియోని ...ఎన్నో యేళ్లు , ఎన్నో గొప్ప కళాకారులను అందించిన రేడియోని ఈ రోజు గుర్తు చేసుకుందాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రజలను ఒకచోట చేర్చి కీలక సమాచారాన్ని అందించే రేడియో ప్రత్యేక శక్తిని గుర్తుచేసుకోవడానికి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవాన్ని( world radio day) జరుపుకుంటారు. అనేక దేశాలలో, రేడియో ప్రాథమిక మాధ్యమం మరియు సమాచార వనరు. స్వాతంత్ర్య పోరాటంలో ఈ రేడియో ఎంత ప్రజాధరణ పొందిందో...అంతే సహాయం కూడా చేసింది. ఎందరో స్వతంత్ర్య సమరయోధులకు ఇది సాధనం. ఇంతేనా ఇప్పుడు సోషల్ మీడియాకు ఎలా అయితే అతుక్కుచస్తున్నారో ...అప్పుడు రేడియో ( radio) కూడా అంతే. అయితే అవన్నీ ఉపయోగపడేవే. అయినా జనాలు రేడియో చుట్టూ మూగి చక్కని సంగీతం, ప్రసంగాలు వినేవారు. రేడియోతో అనుబంధాలు ఉన్నాయో కాస్త పాత తరం వాళ్లని అడగండి.

ఎన్నో విపత్తుల్లో రేడియో ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.1937లో ఆకాశవాణి ( akasavani) ప్రారంభమైనప్పటి నుంచి ఆల్ ఇండియా రేడియో వివిధ రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈరోజు, AIR న్యూస్ ప్రతిరోజూ 92 భాషలు మరియు మాండలికాలలో 607 బులెటిన్‌లను ప్రసారం చేస్తుంది. రేడియో ఎప్పుడు ఎంతో మంది కళాకారులను తయారుచేసింది.2011 లో రేడియో దినోత్సవాన్ని ప్రకటించింది యునెస్కో.

అనేక జర్నలిజం విశ్వవిద్యాలయాలు మరియు మీడియా NGOలు కూడా 2023 థీమ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అసలు రేడియో ఎలా పనిచేస్తుందంటే ...రేడియో తరంగాలు టెలివిజన్, మొబైల్ ఫోన్లు మరియు రేడియోలు వంటి కమ్యూనికేషన్ టెక్నాలజీలలో ఉపయోగించే ఒక రకమైన విద్యుదయస్కాంత వికిరణం. ఈ పరికరాల ద్వారా రేడియో తరంగాలను స్వీకరిస్తారు, ఇవి ధ్వని తరంగాలను ఉత్పత్తి చేయడానికి స్పీకర్‌లోని మెకానికల్ వైబ్రేషన్‌లుగా మారుస్తాయి. రేడియో-ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం అనేది విద్యుదయస్కాంత (EM) స్పెక్ట్రమ్‌లో ఒక చిన్న భాగం.

Tags:
Next Story
Share it