IPL 2024: ఇవాళ పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2024 టోర్నమెంటులో 16 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ 17వ మ్యాచ్

IPL 2024: ఇవాళ పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్
X

Gujarat Titans vs Punjab Kings, 17th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2024 టోర్నమెంటులో 16 మ్యాచులు పూర్తయ్యాయి. ఇవాళ 17వ మ్యాచ్ జరగనుంది. ఇక ఇందులో భాగంగానే గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య కీలంక మ్యాచ్ జరగనుంది. ఈ గుజరాత్ (Gujarat Titans) వర్సెస్ పంజాబ్ టీమ్స్ (Punjab Kings) మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది.

ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు గెలిచింది. దీంతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించి మరింత పటిష్టంగా తయారు కావాలని గుజరాత్ వ్యూహాలు రచిస్తోంది. అటు పంజాబ్ కింగ్స్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఇవాల్టి మ్యాచ్లో గెలిచి మళ్లీ పట్టు సాధించాలని ఆలోచన చేస్తోంది.

గుజరాత్ టైటాన్స్ XI: శుభమాన్ గిల్ (C), వృద్ధిమాన్ సాహా (wk), సాయి సుదర్శన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే

పంజాబ్ కింగ్స్ XI: శిఖర్ ధావన్ (C), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (WK), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, శశాంక్ సింగ్, హర్షల్ పటేల్, హర్పీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్.

Tags:
Next Story
Share it