IND VS ENG: టీమిండియా బిగ్ షాక్

టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇంగ్లాండుతో (England) జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కె.ఎల్ రాహుల్ (KL RAHUL ) దూరమయ్యారు. గాయం నుంచి

IND VS ENG: టీమిండియా బిగ్ షాక్
X

IND VS ENG: టీమిండియాకు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇంగ్లాండుతో (England) జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కె.ఎల్ రాహుల్ (KL RAHUL ) దూరమయ్యారు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోనుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో కర్ణాటకకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ను జట్టుకు ఎంపిక చేసింది.

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ అనంతరం వైజాగ్ మ్యాచ్ కు దూరమైన రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందాడు. దీంతో మిగిలిన మూడు టెస్టుల కోసం సెలక్షన్ కమిటీ రాహుల్ ను ఎంపిక చేసింది.

అయితే మ్యాచ్ ఆరంభానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.... రాహుల్ 90% మాత్రమే కోలుకోవడంతో అతడిని తప్పించారు. 'రాజ్కోట్ టెస్టుకు రాహుల్ దూరమయ్యారు. ప్రస్తుతం 90% కోలుకున్న అతడిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నది' అని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అటు ఇప్పటికే విరాట్‌ కోహ్లీ కూడా ఈ సిరీస్‌ కు దూరం అయిన సంగతి తెలిసిందే.

Tags:
Next Story
Share it