Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు !

టీమిండియాకు గుడ్ న్యూస్..రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) వచ్చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న పంత్.... ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్..ఆ ప్లేయర్ వచ్చేస్తున్నాడు !
X

Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్..రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) వచ్చేస్తున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాదికి పైగా ఆటకు దూరంగా ఉన్న పంత్.... ఐపీఎల్ 2024లో ఆడనున్నాడు. టీం ఇండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నెట్స్ లో సాధన ప్రారంభించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ అప్పటి నుంచి క్రికెట్ కు దూరం అయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ కు (IPL), ఆ తర్వాత టీం ఇండియాలో రానున్నారు. కాగా, తన రికవరీ గురించి పంత్ ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కి పాంటింగ్ పంత్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ఆడే విషయంలో రిషబ్ పంత్ ఎంతో కాన్ఫిడెన్స్ గా ఉన్నాడని పాంటింగ్ తెలిపాడు. కాగా 2022 డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్.... అదృష్టం కొద్ది బతికిపోయాడు. కారు మంటల్లో దగ్ధం కాగా.... పంత్ అందులో నుంచి దూకేశారు. ఈ క్రమంలో పంత్ మోకాలు 180 డిగ్రీలు పక్కకు తిరిగింది. దీంతో లిగమెంట్ సర్జరీ నిర్వహించాల్సి వచ్చింది. మొదట డెహ్రాడూన్ లో పంత్ కు చికిత్స అందించారు. ఈ తరుణంలోనే కోలుకున్నాడు పంత్‌ (Rishabh Pant).

Tags:
Next Story
Share it