IPL2024 : ముంబై ఇండియన్స్ టీం లోకి మరో స్టార్ క్రికెటర్ రీ-ఎంట్రీ!

ఐపీఎల్ లో వరుసగా 5 సార్లు ట్రోఫీ ని గెలుచుకొని ఛాంపియన్స్ గా నిల్చిన ముంబై ఇండియన్స్ టీం కి ప్రస్తుతం నడుస్తున్న సీజన్ చాలా చెత్తగా ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడితే, మూడు మ్యాచులు కూడా అత్యంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది.

IPL2024 : ముంబై ఇండియన్స్ టీం లోకి మరో  స్టార్ క్రికెటర్ రీ-ఎంట్రీ!
X

న్యూస్ లైన్ డెస్క్: ఐపీఎల్ లో వరుసగా 5 సార్లు ట్రోఫీ ని గెలుచుకొని ఛాంపియన్స్ గా నిల్చిన ముంబై ఇండియన్స్ టీం కి ప్రస్తుతం నడుస్తున్న సీజన్ చాలా చెత్తగా ఉందనే చెప్పాలి. ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడితే, మూడు మ్యాచులు కూడా అత్యంత దారుణంగా ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్సీ రోహిత్ శర్మ నుండి హార్థిక్ పాండ్య కి మారడం వల్లే ముంబై ఇండియన్స్ టీం కి ఈ ఘోర పరాభవం ఎదురైందని, ఇప్పటికైనా రోహిత్ శర్మ కి కెప్టెన్సీ ఇవ్వకపోతే అన్నీ మ్యాచులు ఓడిపోవాల్సి వస్తుందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ముంబై ఇండియన్స్ టీం లో అద్భుతంగా ఆడే సూర్య కుమార్ యాదవ్ గడిచిన మూడు మ్యాచుల నుండి దూరంగా ఉన్నారు. ఫిట్నెస్ లోపం కారణం గా దూరంగా ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉన్నారని బెంగళూరు NCA ప్రకటించింది. ఆదివారం నాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరగబోయే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ పాల్గొనబోతున్నారట. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ముంబై ఇండియన్స్ టీం, సూర్య కుమార్ యాదవ్ రాకతోనైనా గాడిలో పడుతుందో లేదో చూడాలి.

Tags:
Next Story
Share it