Honor: చౌక ధరలో అద్భుత ఫీచర్లతో హానర్ మొబైల్..లాంచ్ ఎప్పుడంటే.?

ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ఉన్నాయి.ఇందులో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతున్న కంపెనీ హానర్.అలాంటి హానర్ హానర్ 200, 200ప్రో సిరీస్ చైనాలో విడుదల

Honor: చౌక ధరలో అద్భుత ఫీచర్లతో హానర్ మొబైల్..లాంచ్ ఎప్పుడంటే.?
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతున్న కంపెనీ హానర్(Honor). అలాంటి హానర్ హానర్ 200, 200ప్రో సిరీస్ చైనాలో విడుదల చేయబడింది. ఈ తరుణంలో ఈ మొబైల్ త్వరలో భారతదేశంలో కూడా లాంచ్ అవ్వనుంది.

హానర్ 200 duo (Honor 200 duo) యొక్క గ్లోబల్ లాంచ్ జూన్ 12న ఉన్నది. అలాంటి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హానర్ 200 మరియు 200 ప్రో 12gb ర్యామ్ 512 జీబీ కాన్ఫిగరేషన్ లో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ మొబైల్ 2664×1200 పిక్సెల్స్ కలిగి ఉంటుంది. ప్రో వేరియంట్ 2700×1224 పిక్సెల్స్ రిజల్యూషన్ తో రాబోతోంది. అలాగే ఈ మొబైల్ స్క్రీన్ విషయానికి వస్తే 6.7 అంగుళాల క్వాడ్ క్వడ్ OLED డిస్ప్లే , అలాగే 120hz రిఫ్రెష్ రేటు, 3840HZ PWM డిమ్మింగ్ మరియు నాలుగువేల నీట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంటుంది. అలాగే శక్తివంతమైన విజువల్స్ కలిగి ఉంటుంది.

హానర్ 200 స్నాప్ డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ చిప్సెట్ శక్తిని పొందుతోంది. అలాగే ఈ వేరియంట్ 8S GEN 3 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ రెండు 5200Mah బ్యాటరీ కలిగి ఉండి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీని కెమెరా విషయాలకు వస్తే 50 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, త్రీడీ డెప్త్ సెన్సార్ ఇక వెనుక వైపు త్రిపుల్ కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. అంతేకాకుండా ఈ రెండు మోడల్స్ లో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ డ్యూయల్ స్పీకర్లు, ఐఆర్ బ్లాస్టర్లు కలిగి ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే €600 నుంచి €650 మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే హానర్ప్ 200 ప్రో విషయానికి వస్తే €750-€800 మధ్య ఉంటుంది.

Tags:
Next Story
Share it