Realme:చౌక ధరలో సరికొత్త లుక్ లో ఇయర్ బడ్స్.. ఫీచర్స్ ఇవే.!

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఉన్నాయి. కానీ ఇందులో అత్యంత ఆదరణ పొందిన కంపెనీ అంటే రియల్ మీ. ఈ కంపెనీ నుంచి త్వరలో న్యూ మొబైల్

Realme:చౌక ధరలో సరికొత్త లుక్ లో ఇయర్ బడ్స్.. ఫీచర్స్ ఇవే.!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్, ఇయర్ బడ్స్ ఉన్నాయి. కానీ ఇందులో అత్యంత ఆదరణ పొందిన కంపెనీ అంటే రియల్ మీ. ఈ కంపెనీ నుంచి త్వరలో న్యూ మొబైల్ మరియు ఇయర్ బడ్స్ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియాలో రియల్ మీ కంపెనీ నుంచి జిటి 6T స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోనును మే 22న విడుదల చేయనున్నారట.

ఈ ఫోన్ విడుదలతో పాటుగా రియల్ మీ బడ్స్ Air 6 Tws కూడా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోందట. i the బ్రాండ్ ఇయర్ బడ్స్, హై రేస్ ఆడియోను కలిగి ఉన్న దాని యొక్క విభాగంలో మొదటిది అని పేర్కొంది. ఇయర్ బడ్స్ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇప్పటికే ఇవి చైనాలో ప్రారంభించబడ్డాయి. ఈ ఇయర్ బడ్స్ లో 12.4mm టైటానియం లేయర్ తో కూడిన డైనమిక్ డ్రైవర్లు ఉంటాయని తెలుస్తోంది. అంతేకాకుండా LHDC 5.0 మరియు HI -Res ఆడియో మద్దతు కలిగి, 50 డేసిబుల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉండవచ్చు.

ఈ పరికరంలో ముఖ్య లక్షణం ఏంటంటే ఇందులో డ్యూయల్ కనెక్టివిటీ ఉంటుంది. దీని ఛార్జింగ్ విషయానికొస్తే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 గంటల వరకు బ్యాటరీ మన్నిక ఉంటుంది. కేవలం ఏడు నిమిషాలు చార్జి చేస్తే ఏడు గంటల వరకు ప్లే బ్యాక్ ఆశించవచ్చు. అంతేకాకుండా ఐపీ55 వాటర్ మరియు డస్ట్ రేసిస్టెంట్ , బ్లూటూత్ 5.3 టచ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక దీని ధర ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Tags:
Next Story
Share it