Vivo Y200 pro 5G:అద్భుత ఫీచర్లతో త్వరలో లాంచ్..!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతున్నటువంటి కంపెనీ వివో. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల

Vivo Y200 pro 5G:అద్భుత ఫీచర్లతో త్వరలో లాంచ్..!
X

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి. ఇందులో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతున్నటువంటి కంపెనీ వివో. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వేరియంట్లు బయటకు వచ్చాయి. అలాంటి ఈ తరుణంలో వివో కంపెనీ నుంచి మే 21వ తేదీన సరికొత్త మొబైల్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అదే వివో వై 200 ప్రో 5g త్వరలో ఈ మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేయనుంది. మరి ఈ మొబైల్ యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

ఈ మొబైల్ కంటే ముందు వివో వై 200 మొబైల్ ను రిలీజ్ చేసింది కంపెనీ. ఈ మొబైల్ ఫీచర్స్ లాగే వివో వై200 pro ఫీచర్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. వివో వై 200 120hz AMOLED స్క్రీన్ కలిగి ఉంది. వివో వై 200 ప్రో కూడా ఈ విధంగానే ఉండబోతుందట. అంతేకాకుండా డ్యూయల్ రియర్ కెమెరాలు, ఫోన్ గ్రీన్ కలర్ లో వెనుక వైపు నమూనాలతో చూపిస్తోంది. ఇక వై 200 లో స్నాప్ డ్రాగన్ ఫోర్త్ జనరేషన్ 1 తో పోలిస్తే , ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 5g చిప్ సెట్ తో వస్తుందట.

ఇక ఈ మొబైల్ సెగ్మెంట్లో కేవలం 7.49mm వద్ద స్లిమ్మేస్ట్ 3డి కర్వ్ డ్ డిస్ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క డిజైన్ వివో వై 29 లైట్ ని పోలి ఉంటుందని, ఇది వక్ర స్క్రీన్ మరియు స్నాప్ డ్రాగన్ 695 Soc ని కలిగి ఉంటుందట. ఈ కొత్త మొబైల్ లో ట్రిపుల్ వెనుక కెమెరాలకు బదులుగా, డ్యూయల్ వెనుక కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ ధర విషయానికి వస్తే 20వేల నుండి 25 వేల మధ్య ఉండవచ్చు. దీనికంటే ముందు వచ్చిన వివో వై 200 5g మొబైల్ 21, 999 ధర ఉంది. మరి కొత్త మొబైల్ ధర ఎంత ఉంటుంది అనేది చెప్పలేం.

Tags:
Next Story
Share it