Infinix Note 40 Pro+:108mp కెమెరాతో అద్భుత 5gఫోన్.త్వరలో లాంచ్..!

ఇన్ఫినిక్స్ నోట్ 40pro మరియు ప్రో + మోడల్స్ త్వరలో ఇండియాలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు 14 ఆధారిత XOS 14తో వస్తున్నాయి.

Infinix Note 40 Pro+:108mp కెమెరాతో అద్భుత 5gఫోన్.త్వరలో లాంచ్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఇన్ఫినిక్స్ నోట్ 40pro మరియు ప్రో + మోడల్స్ త్వరలో ఇండియాలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు 14 ఆధారిత XOS 14తో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ఏప్రిల్ 12వ తేదీన ఇండియాలో గ్రాండ్ గా లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఫోన్ల యొక్క ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5G మొబైల్స్ 108 ఎంపీ ప్రధాన కెమెరాని కలిగి ఉంటాయి. అలాగే ఈ ఫోన్స్ టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్, ఆబ్సిడియన్ బ్లాక్ కలర్స్ లో వస్తోంది. ఈ ఫోన్స్ మీడియా టెక్ డైమన్సిటీ చిప్సెట్ కలిగి ఉండడమే కాకుండా 7020 SOCలు 12GB RAM అలాగే అదనంగా 12 జిబి వరకు విస్తరించుకోవచ్చు. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 120Hz AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ 5జి మొబైల్స్ భారతీయ వేరియంట్స్ వాయిస్ యాక్టివేటెడ్ ఏఐ బ్యాక్డ్ యాక్టివ్ హాలో లైట్లను కలిగి ఉంటాయి.

అంతేకాకుండా హ్యాండ్ సెట్లు 3x లాస్ లెస్ జూమ్ మరియు 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 108 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 40pro 5g యొక్క గ్లోబల్ వేరియంట్ ధర $289, ఇండియాలో సుమారు రూ:24000, అంతేకాకుండా ఇన్ఫినిక్స్ నోట్40 ప్రో +5g $309, ఇండియాలో రూ:25వేల ధరతో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ మొబైల్స్ ఆల్ రౌండ్ ఫాస్ట్ చార్జ్ 2.0 టెక్నాలజీ కలిగి ఉంటాయట. అలాగే ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 5000mAh బ్యాటరీ, 100W వైర్డ్ హైపర్ చార్జింగ్, 20W వైర్లెస్ మ్యాగ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తాయట.

Tags:
Next Story
Share it