KTR: ప్రశ్నించే గొంతులను నొక్కడమే ప్రజాపాలనా..?

తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు.


Published Sep 05, 2024 05:06:00 PM
postImages/2024-09-05/1725536160_ktrreactsondiliparrest.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రజా పాలన అంటే ప్రశ్నించే గొంతులను నొక్కడమేనా అని మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం అరెస్ట్‌పై స్పందించిన ఆయన.. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దిలీప్‌ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థతను, చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతోందని ఆయన విమర్శించారు. తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించగా హైకోర్టు చీవాట్లు పెట్టినా, బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు.

కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పకుండా అరెస్ట్ చేశారని కేటీఆర్ తెలిపారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చని కాంగ్రెస్ నాయకులు భ్రమలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లు మరింత పుట్టుకొస్తారని కేటీఆర్ హెచ్చరించారు. అక్రమంగా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ లేకుండా పోయిందని ఆయన అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people ts-news news-line newslinetelugu brs ktr telanganam social-media

Related Articles