Nalgonda : కోతులు చనిపోయిన నీటిని తాగిన నల్గొండ జనాలు!

కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారింది నల్గొండ జిల్లా నేడు జరిగిన ఒక ఘోర సంఘటన. ప్రజల ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం అనేది ప్రతీ రోజు ఎదో ఒక సంఘటనతో నిరూపించుకుంటూనే ఉండి ప్రభుత్వం.

Nalgonda : కోతులు చనిపోయిన నీటిని తాగిన నల్గొండ జనాలు!
X

న్యూస్ లైన్, నల్గొండ: కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా మారింది నల్గొండ జిల్లా నేడు జరిగిన ఒక ఘోర సంఘటన. ప్రజల ప్రాణాలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం అనేది ప్రతీ రోజు ఎదో ఒక సంఘటనతో నిరూపించుకుంటూనే ఉండి ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలోని నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాలు ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కోతులు చనిపోయిన ఆ వాటర్ ట్యాంక్ నీరుని గత కొద్ది రోజుల నుండి NSP అధికారులు సరఫరా చేస్తున్నారు, వాటినే ప్రజలు తాగుతున్నారు. అధికారులు నిర్లక్ష్య ధోరణితో వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు తెలుస్తుంది. దాదాపుగా 30 నుండి 40 కోతుల మృతదేహాలు ఈ వాటర్ ట్యాంక్ లో లభ్యమైనట్టుగా చెప్తున్నారు అధికారులు. గత కొద్ది రోజుల నుండి ఈ నీరుని తాగుతున్న జనాల పరిస్థితి ఏమిటో అర్థం కానీ స్థితిలో ఉంది.

Tags:
Next Story
Share it