Rapido: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌..!

హైదరాబాద్ మహానగరంలో (Hyderabad) రాపిడో సేవలు (Rapido) విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే రాపిడో సేవలను వినియోగించుకుం

Rapido: పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌..!
X

Rapido: హైదరాబాద్ మహానగరంలో (Hyderabad) రాపిడో సేవలు (Rapido) విపరీతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లాలన్నా వెంటనే రాపిడో సేవలను వినియోగించుకుంటున్నారు ప్రయాణికులు. మనకు బైక్ లేకున్నా సరే... మొబైల్ ఫోన్లో ఇలా బుక్ చేస్తే... అలా వచ్చేస్తున్నారు బైక్ రైడర్లు. దీంతో మనం చేరుకోవాల్సిన గమ్యానికి చాలా సులభంగా చేరుతున్నాం.

ముఖ్యంగా రాపిడో బైక్ (Rapido) బుక్ చేసుకుంటే మనకు తక్కువ ధర పడుతుంది. అయితే తాజాగా ఈ రాపిడో బైక్ డ్రైవర్ కు వింత సంఘటన ఎదురయింది. కస్టమర్ చేసిన పనికి... అతనికి చుక్కలు కనిపించాయి. పెట్రోల్ అయిపోయినా కస్టమర్‌..బైక్ దిగలేదు. దీంతో అలాగే తోసుకుంటూ రాపిడో రైడర్ వెళ్లాడు. హైదరాబాద్‌ లో (Hyderabad) ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి రాపిడోలో (Rapido) బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది. దగ్గర్ లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను తిరస్కరించడంతో ఇలా కస్టమర్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను చూసిన జనాలు నవ్వుకోవడమే కాకుండా.. ఆ కస్టమర్‌ ను బండ బూతులు తిడుతున్నారు.

Tags:
Next Story
Share it