CBSE సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఫేక్‌.. ఫాలో కావొద్దు!

ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతులు ఉపయోగిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు

CBSE సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఫేక్‌.. ఫాలో కావొద్దు!
X

CBSE: ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు(Cyber Crime) రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతులు ఉపయోగిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఛానల్స్ లో లింక్ లు ఓపెన్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మపలుకుతూ.. డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే CBSE బోర్డు విద్యార్థులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ లోగో పేరుతో ఫేక్ అకౌంట్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ నకిలీ హ్యాండిల్స్‌తో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అయితే ‘ఎక్స్‌’(ట్విట్టర్)లో @cbseindia29' అనే అకౌంట్ మాత్రమే సీబీఎస్‌ఈ ది అని తెలిపారు. ఇందులో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని వెల్లడించారు. ఇక, సీబీఎస్‌ఈ(CBSE) పేరుతో మొత్తం 30 నకిలీ(fake) అకౌంట్లు(accounts) ఉన్నట్లు గుర్తించారు. ఈ కౌంట్లు క్రియేట్ చేసి విద్యార్థులు, తల్లిదండ్రుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అకౌంట్లను ఎవరూ ఫాలో కావొద్దని తెలిపారు. మరోవైపు సోషల్ మీడియా(Social media)లో ఫేక్ ఖాతాల ద్వారా వచ్చిన సమాచారానికి తమది బాధ్యత కాదని CBSE స్పష్టం చేసింది.

Tags:
Next Story
Share it