Ancient Statue: తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల !

గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత ఏర్పడింది.

Ancient Statue: తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : తెలంగాణలోని ( TELAGANA) సిధ్దిపేట జిల్లా( SIDDPET) దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది.గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. అంగడి వీరన్న శివాలయంగా( SHIVALAYAM) పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత ఏర్పడింది. ఆ గుంత నుంచే ఈ శిలను బయటకు తీశారు గ్రామస్థులు

పురావస్తు శాఖ అధికారి శ్రీనివాస్( SRINIVAS) మాట్లాడుతూ.. తాజాగా బయటపడ్డ ఈ శిల జైన చౌముఖి శిల్పం అని, 5 అడుగుల ఎత్తుతో చెక్కారని చెప్పారు.చాళుక్యుల కాలం నాటిదని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ కనుగొంది. నలువైపులా ఉన్న శిల్పాలు 24వ జైన తీర్థంకరుడు మహా వీరుడి ధ్యానం చేస్తున్న చిత్రాలని వివరించారు.

గతంలో ఈ తరహా శిల్పాలను కొలనుపాక, వేములవాడలో( VEMULAWADA) గుర్తించామని చెప్పారు. జైనులు వీటిని ‘సర్వతోభద్ర’ అంటూ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ శిల్పాలు లభించిన ప్రాంతాలు గతంలో జైనధర్మ కేంద్రాలుగా విరాజిల్లాయని వివరించారు. బౌద్దుల( BUDDAS) తరహాలోనే జైనులు కూడా స్థూపాలు , చైత్యాలు నిర్మించుకునేవారని తెలిపారు. అయితే మరిన్ని వివరాలను కాస్త పరిశోధన చేసేటపుడు మాత్రమే తెలుస్తుందని తెలిపారు.

Tags:
Next Story
Share it