Bandi Sanjay: చిత్తం కొండగట్టు అంజన్న మీద.. భక్తి పోట్వలు, పబ్లిసిటి మీద..!

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొండగట్టు అంజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు.

Bandi Sanjay: చిత్తం కొండగట్టు అంజన్న మీద.. భక్తి పోట్వలు, పబ్లిసిటి మీద..!
X

కొండగట్టు గుడిలో బండి సంజయ్ హంగామా

ఆలయ నిబంధనలు బేఖాతరు చేస్తూ....

గుడిపై డ్రోన్ కెమెరాలతో వీడియోలు

ప్రహారి గోడలు ఎక్కి బండి ఫోటో షూట్

ప్రచారం కోసం బండి సంజయ్ ఆరాటం

చోద్యం చూసిన ఆలయ సిబ్బంది, పోలీసులు

బీజేపోళ్ల భక్తి ఇదేనా అని భక్తుల ఆగ్రహం

హైలైట్ బాక్స్

చిత్తం శివుని మీద. భక్తి చెప్పుల మీద అని ఓ సామెత ఉంటది. సేమ్ టు సేమ్ బండి సంజయ్ యవ్వారం కూడా. కొండగట్టు అంజన్న గుడిలో బండి సంజయ్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్లు చూసి సగటు భక్తుడే నోరెల్లబెట్టారు. ఆలయ నియమ నిబంధలు అన్నీ పక్కకు పెట్టేసి... బండి ఫోటోలు, వీడియోల కోసం నానా పాట్లు చేసింది ఆయన పీఆర్ టీమ్. గుడిపై డ్రోన్లు ఎగరవేశారు. గుడి ప్రహారీ గోడలెక్కిసి అన్నను కెమెరాల్లో బందించేశారు. ఆ ఫోటోలు, వీడియోలు కాస్త ఇప్పుడు కరీంనగర్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ నాయకుల భక్తి ఇదేనా ? అని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణం, జగిత్యాల : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కొండగట్టు అంజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించారు. తన ఎన్నికల ప్రచారం కోసం ఆలయ నిబంధనలు పట్టించుకోకుండా డ్రోన్ కెమెరాతో షూటింగ్ తేయడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయానికి వచ్చిన బండి సంజయ్, ఆలయ నిబంధనలు మర్చిపోయారు. ఆయన అనుచరులు సైతం ఆలయ ప్రాంగణం ప్రహారిగోడలు ఎక్కి షూటింగ్ లు చేశారు. డ్రోన్ కెమెరాలు ఎగురవేశారు.

పవిత్రమైన అంజన్న ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరాలు వాడడం నిషేధం. కానీ బండి సంజయ్ కోసం డ్రోన్ కెమెరాలు ఎగురవేశారు. తప్పని చెప్పి కేసులు పెట్టాల్సిన అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించారు. డ్రోన్‌ను వినియోగించిన సమయంలో ఆలయ అధికారులు, పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నా.. అడ్డుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్‌ను వివరణ కోరితే , ఆలయ ప్రాంగణంలో డ్రోన్ వినియోగంపై ఆంక్షలు ఉన్నాయన్నారు. పైగా ఎలాంటి అనుమతి తీసుకోలేదని చెబుతున్నారు.

నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే దేవస్థానాల్లో అసాంఘిక శక్తుల కదలికలపై దృష్టిసారించే అధికారులు, ఇలా ఓ రాజకీయ నాయకుడి కోసం రూల్స్ ని తుంగలో తొక్కారు. అధికారులు, పోలీసులు.. రాజకీయ నాయకులకు భజన చేయకుండా ఆలయ పవిత్రత కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it