Mahabubnagar : రైతుల మెడపై బ్యాంకుల కత్తి..పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు!

అధికారంలోకి వచ్చే ముందు హామీల మీద హామీలు ఇచ్చేసి, తీరా అధికారం లోకి వచ్చిన తర్వాత మొండిచెయ్యి చూపడం కాంగ్రెస్ పార్టీ కి కొత్తేమి కాదు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాము, ఒకసారి కాంగ్రెస్ ని కూడా చూద్దాం అని ప్రజలు ఒక అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్నీ వర్గాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది.

Mahabubnagar : రైతుల మెడపై బ్యాంకుల కత్తి..పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు!
X

న్యూస్ లైన్ డెస్క్: అధికారంలోకి వచ్చే ముందు హామీల మీద హామీలు ఇచ్చేసి, తీరా అధికారం లోకి వచ్చిన తర్వాత మొండిచెయ్యి చూపడం కాంగ్రెస్ పార్టీ కి కొత్తేమి కాదు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసాము, ఒకసారి కాంగ్రెస్ ని కూడా చూద్దాం అని ప్రజలు ఒక అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్నీ వర్గాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది. ముఖ్యంగా రైతుల కస్టాలు వర్ణనాతీతం. ఎక్కడ చూసినా ఆత్మహత్యల వార్తలు చూస్తూనే ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కరువు అనే పదాన్ని దాదాపుగా రైతులందరూ మర్చిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కరువు అంటే ఏంటో మరోసారి రుచి చూపిస్తుంది. అధికారం లోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన మాటని పూర్తిగా మరిచిపోయింది. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ని నాశనం చెయ్యాలి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనేయాలి అనే దానిపైనే సీఎం రేవంత్ రెడ్డి ద్రుష్టి కేంద్రీకృతమైంది. రైతుల రుణ మాఫీ గురించి ఇసుమంత పట్టింపు కూడా లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9 న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ దాటి మూడు నాలుగు నెలలు పూర్తి అయినా పట్టించుకోలేదు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే,పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తూ,వసూలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ కి చెందిన వెంకట్ రెడ్డి అనే రైతు కొన్నేళ్ల క్రితం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో పంట ఋణం తీసుకున్నాడు. రుణమాఫీ అవుతుందనే ధీమాతో అతను తిరిగి కట్టలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న అప్పు వడ్డీ తో కలిపి 2 లక్షల 16 వేల రూపాయిలు అయ్యింది. బ్యాంక్ వెంకట్ రెడ్డి ని సంప్రదించి వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి చెయ్యడం తో వేరే దారి లేక అప్పు చేసి లక్ష 46 వేల రూపాయిలు చెల్లించాడు. ఇలాంటి కేసులు రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నాయి. అధికారం దక్కగానే ప్రజలకిచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వాటిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ కు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్నదాతల ఆగ్రహానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు.

Tags:
Next Story
Share it