Congress: మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, BRS దూరం

నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన ఉండనుంది. ఇవాళ ఉదయం 10.15కి అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌

Congress: మేడిగడ్డ సందర్శనకు బీజేపీ, BRS దూరం
X

Congress :నేడు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన ఉండనుంది. ఇవాళ ఉదయం 10.15కి అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో మేడిగడ్డకు పయనం కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం మేడిగడ్డ బ్రిడ్జ్‌, కుంగిన పిల్లర్ల పరిశీలన ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా రిలీజ్‌ చేశారు అధికారులు.

మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ మంత్రుల బృందం, ఇతర పార్టీల వారు మేడిగడ్డ చేరుకుంటారు. 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జ్..కుంగిన పిల్లర్ల పరిశీలన ఉంటుంది. 5 నుంచి 5.30 సీఈ సుధాకర్ రెడ్డి ప్రజెంటేషన్ ఉంటుంది. 6 నుంచి 6.30 వరకు సీఎం రేవంత్, ఉత్తమ్..మీడియా సమావేశం ఉండనుంది. అయితే..మేడిగడ్డ పర్యటనకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు దూరంగా ఉంటున్నాయి. అటు ఎంఐఎం, సీపీఐ మాత్రమే మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నాయి.

కాగా నేడు నల్లగొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు ఛలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ జరగనుంది.

Tags:
Next Story
Share it