Brs Chief KCR: నేడు నల్లగొండకు కేసీఆర్

నేడు నల్లగొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు.

Brs Chief KCR: నేడు నల్లగొండకు కేసీఆర్
X

భారీ ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు

గులాబీ బాస్ ప్రసంగంపైనే సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణం, హైదరాబాద్: నేడు నల్లగొండకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు ఛలో నల్లగొండ పేరుతో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. మంగళవారం మధ్యాహ్నం సభ జరగనుంది. ‘దక్షిణ తెలంగాణ’కు ప్రాణదాయిని అయిన కృష్ణా నదిపై రాష్ట్ర హక్కులను కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కృష్ణా జలాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రానికి ప్రాజెక్టుల అప్పగింతకు కారణం మీరంటే మీరంటూ ఇరువర్గాలు పరస్పర విమర్శలు చేసుకున్నాయి. ఇదే అంశంపై నేటి నల్లగొండ సభలో మాట్లాడేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వస్తున్నారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మాట్లాడబోతున్న తొలి బహిరంగ సభ ఇదే. దీంతో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సభ ఏర్పాట్లను మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు.

Tags:
Next Story
Share it