Niranjan Reddy : ‘తెలంగాణలోని ప్రతి ఇంచు మీద కేసీఆర్‌కు అవగాహన ఉంది’ : నిరంజన్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Niranjan Reddy :  ‘తెలంగాణలోని ప్రతి ఇంచు మీద కేసీఆర్‌కు అవగాహన ఉంది’ : నిరంజన్ రెడ్డి
X

Niranjan Reddy : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్గొండలో జరిగిన బహిరంగ సభలో నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంచు కేసీఆర్‌కు తెలుసునని అన్నారు. ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో.. ఏ ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలో కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో తనకంటే తెలిసిన వారు తెలంగాణ రాష్ట్రంలో మరెవరు లేరని అన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి.. రైతును రాజును చేసిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులకు మరమ్మతులు చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించామన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి ఆయకట్టుకు నీరు అందించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరంలో జరిగిన చిన్న పొరపాటును పట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో కలుగుతోందన్నారు. పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. అమలుకు సాధ్యం కాని.. హామీలు ఇచ్చి వాటిని ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు కాళేశ్వరం వద్ద డ్రామాలు ఆడుతున్నారన్నారు.

Tags:
Next Story
Share it