Brs leaders: రూ. 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి!

రైతులకు రూ.25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

Brs leaders: రూ. 25వేలు నష్టపరిహారం ఇవ్వాలి!
X

సీఎస్‌కు వినతి పత్రం ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు అందజేత

తెలంగాణం, హైదరాబాద్ : రైతులకు రూ.25 వేల నష్టపరిహారం, రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఇచ్చిన‌ పిలుపుమేరకు మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎస్‌కు విన‌తీ ప‌త్రం అందజేశారు. వెంట‌నే రైతుల‌కు రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ సైతం చేయాల‌ని, ఇచ్చిన హామీ మేర‌కు రూ.15వేల రైతు భ‌రోసా ఇవ్వాల‌ని కోరారు. సీఎస్‌ను కలిసివారిలో మాజీ మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, జ‌గ‌దీష్ రెడ్డి, స‌త్య‌వ‌తి రాథోడ్ సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో ముఖ్యనేతలతో కలిసి, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.

ఖమ్మంలో..

ప్రజలు , రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, పంట నష్టపోయిన రైతులకు సత్వరమే ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అదనంగా ఇస్తానన్న 500 రూపాయలు బోనస్ ను తక్షణమే ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గౌతమ్‌‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు .

సూర్యాపేటలో

దాన్యానికి రూ.500 బోనస్‌, రైతు భరోసా, రైతు రుణమాఫీ హామీలు అమలు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సారథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టర్ కార్యాలయంలో వినతీపత్రం అందజేశారు.

నర్సంపేటలో

వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇటీవల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని, అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు జిల్లా ప్రతినిధులు, రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

గద్వాల జిల్లాలో...

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బి.సంతోష్‌కు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే వినతీపత్రం అందజేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పంటకు మద్దతు ధర, క్వింటాలకు 500 రూపాయలు చెల్లించాలని కోరారు.

రంగారెడ్డిలో....

రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ,నష్టపోయిన పంటలకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కొంగరా కాలన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Tags:
Next Story
Share it