KTR: ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీలు, గల్లీల్లో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు

KTR: ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు
X


కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ ఫైర్

బీజేపీ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్ధులు

బీజేపీని గెలిపించేందుకు...

కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కవ శ్రమ పడ్డారు

కేసీఆర్ యాత్రతో రాజకీయ మలుపు

ప్రాంతీయ పార్టీలదే హవా

బీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తోంది

తెలంగాణం, సిరిసిల్ల : రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీలు, గల్లీల్లో దోస్తీ అన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని, ఇక్కడ మాత్రం కలిసి పని చేసుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ అభ్యర్ధులను గెలిపించేందుకు ఏడుగురు బలహీనమైన డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టారని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలో డమ్మీలను పెట్టారని ఆరోపించారు. సికింద్రాబాద్ అభ్యర్ధి కనీసం ప్రచారం కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఎక్కువ కష్టపడ్డారని కేటీఆర్ విమర్శించారు.

రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ బస్సు యాత్ర మలుపు తిప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ 17రోజుల బస్సు యాత్రతో జాతీయ పార్టీల నాయకత్వాలు దిగివచ్చాయన్నారు. కేసీఆర్ బస్సు యాత్రలో గులాబీ సైన్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనిపడిందన్నారు. రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆశీర్వాదంతో అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నామని అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్, వైసీపీ, బీజూ జనతాదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్షగా ఉంటుందన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చిల్లర ప్రయత్నం కూడా ప్రజల నుంచి వ్యతిరేకతకు పెరగడానికి ఓ కారణమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో 420 హామీలు ఇచ్చిందన్నారు. వీటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిందని , ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకావడం లేదని ప్రజల్లో వ్యతిరేకత కనిపించిందన్నారు. రైతులను రైతుభరోసాతో మోసం చేశారని, కరెంటు ఇవ్వలేదని, బోనస్ పేరుతో బోగస్ చేసినందుకు రైతులంతా ఓట్ల రూపంలో కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకున్నారని కేటీఆర్ అన్నారు.

Tags:
Next Story
Share it