Cm revanth reddy::రెండు చోట్లా ఓటమేనా?

సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది

Cm revanth reddy::రెండు చోట్లా ఓటమేనా?
X

మహబూబ్ నగర్, మల్కాజిగిరిలలో

కాంగ్రెస్‌కు మూడోస్థానం!

రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ అంటూ ప్రచారం!

మహబూబ్ నగర్‌‌కు 8సార్లు వెళ్లిన సీఎం

వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం శ్రమించిన రేవంత్

మల్కాజిగిరి రేవంత్ స్థానం

అక్కడా గెలుపు కష్టమే?

రోజురోజుకీ పడిపోతున్న రేవంత్ గ్రాఫ్

ఆ రెండు స్థానాల్లో కనిపించని రేవంత్ ప్రభావం

తెలంగాణం, పొలిటికల్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అటు సొంత జిల్లాలో .. ఇటు రాజధాని పరిధిలో ఆయన ప్రాబల్యం ఏమాత్రం లేదని తాజా ఎన్నికలను బట్టి తెలుస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మహబూబ్ నగర్ స్థానం, అటు తను బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసిన మల్కాజిగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా పరిస్థితులు ఉండటమే దీనికి కారణం. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుందని సర్వేలు చెబుతున్నాయి.

వంశీచంద్ రెడ్డి పోటీచేస్తున్న మహబూబ్ నగర్‌ నియోజకర్గంలో సుమారు 8 సార్లు పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని, తన పరువు కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఓటర్లు కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్, బీజేపీల వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉండటంతో.. ఈ ఇద్దరి మధ్య పోరులో వంశీచంద్ రెడ్డి తేలిపోయినట్టుగా స్థానికంగా టాక్ వినపడుతోంది. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకుని మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా.. అత్యధిక సార్లు నియోజకవర్గానికి వెళ్లొచ్చినా.. ఓటర్లు కనికరించలేదని తెలుస్తోంది. వంశీచంద్ రెడ్డి ఓటమిని సీఎం రేవంత్ వ్యక్తిగత ఓటమికి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇక మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్నారు ఓటర్లు. ఈ స్థానం కూడా కాంగ్రెస్ చేజారుతుందని సర్వేలు చెబుతున్నాయి. సిట్టింగ్ ఎంపీగాఉన్న రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ఈట రాజేందర్ పోటీలో ఉన్నారు. ఈ స్థానంలో పోటీ అంతా బీఆర్ఎస్, బీజేపీ మధ్యే అన్న చర్చ జరుగుతోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి రెండు స్థానాల్లోనూ తనవారిని గెలిపించుకోలేపోతున్నారన్న టాక్ వినపడుతోంది.

రోజురోజుకీ పడిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రాఫ్‌కి ఇది నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు. మాటలు తప్ప చేతలు లేవన్న చర్చ ప్రజల్లోకి వెళ్లిపోవడంతో ఆయన ప్రభావం పెద్దగా లేకుండా పోయిందంటున్నారు. తను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను గెలిపంచుకోలేకపోతున్నారంటున్నారు. ఇది రేపటి రోజున పార్టీలో ఆయన స్థానంపైనా ప్రభావం చూపుతుందంటున్నారు. రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్, మల్కాజిగిరి స్థానాల్లో గెలుపు ఎంతో ముఖ్యం. ఇప్పుడు ఆ రెండు డౌట్ కావడంతో రేవంత్ రెడ్డికి కొత్త చిక్కులు తప్పవంటున్నారు. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడకపోతే రేవంత్ రెడ్డికి పార్టీలో ఇబ్బందులు ఉంటాయంటున్నారు. అసలే వర్గాలు ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌లో.. ఆయనను సైడ్ చేయడానికి రెడీగా ఉండే బ్యాచ్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుందంటున్నారు.

Tags:
Next Story
Share it