Congress: ఆర్ ఆర్ బీ ట్యాక్స్ ..?

ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్ల తతంగాన్ని "తెలంగాణం" పత్రిక బయటపెట్టింది. ప్రత్యేకంగా టీములు, ఆఫీసులు పెట్టి మరీ ఈ దందా నడిపిస్తున్నట్టుగా వెల్లడైంది

Congress: ఆర్   ఆర్ బీ ట్యాక్స్ ..?
X

రాష్ట్రంలో బట్టబయలవుతున్న ట్యాక్సుల బాగోతం

వరుసపెట్టి బయటకొస్తున్న ట్యాక్స్ లు

కడుతున్నదెవరు..? తీసుకుంటున్నదెవరు.?

బీ ట్యాక్స్ గురించి చెప్పిన మహేశ్వర్ రెడ్డి

బీ ట్యాక్స్ ఆర్థిక శాఖదేనన్న బక్క జడ్సన్

మరి "ఆర్" "ఆర్ " ట్యాక్స్ లు ఎవరివి.?

బయటపడని ట్యాక్స్ లు ఇంకెన్ని ఉన్నయ్..?

ఫీజుల నియంత్రణ చట్టం అందులో భాగమేనా.?

హైలైట్ బాక్స్..

దేశమంతటా ప్రస్తుతం ఎండాకాలం నడుస్తోంది. కానీ రాష్ట్రంలో మాత్రం ట్యాక్స్ ల కాలం నడుస్తోంది. అప్పట్లో నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ తర్వాత.. ఈ కొత్త ట్యాక్సుల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అది చట్టబద్ధంగా తీసుకొచ్చి ప్రజలపై మోపిన భారం అయితే.. ఇక్కడ మాత్రం చట్ట వ్యతిరేకంగా వ్యాపారవేత్తల నుంచి వసూళ్లు చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీలో ఉన్నవాళ్లు కూడా ఇదేమాట చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణం, హైదరాబాద్: రాష్ట్రంలో కొద్దిరోజులుగా కొత్త కొత్త ట్యాక్సుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆర్ ట్యాక్స్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్ల తతంగాన్ని "తెలంగాణం" పత్రిక బయటపెట్టింది. ప్రత్యేకంగా టీములు, ఆఫీసులు పెట్టి మరీ ఈ దందా నడిపిస్తున్నట్టుగా వెల్లడైంది. అయితే ఈ వార్త ప్రచురితమైన తర్వాత.. మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఆర్ ట్యాక్సే కాదు.. ఆర్, ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూలు జరుగుతోందని అధికార పార్టీకి చెందిన కొందరు "తెలంగాణం" పత్రికకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో బీ ట్యాక్స్ పేరుతో మరో దందా నడుస్తోందని ఆయన చెప్పారు. ఇది మరింత సంచలనంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వసూళ్లపై ఆరోపణలు చేశారు. రూ.2500 కోట్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లినట్టుగా తమకు సమాచారం ఉందన్నారు. దీంతో రాష్ట్రంలో ఆ ట్యాక్సుల మీదే సర్వత్రా చర్చ జరుగుతోంది. "ఆర్" ట్యాక్స్ ఎవరి ఖాతాలోకి వెళుతోంది.? మరో "ఆర్" ట్యాక్స్ ఎవరి కోసం వసూలు చేస్తున్నారు.? ఈ "బీ" ట్యాక్స్ మతలబు ఏంటనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో.. కాంగ్రెస్ లో సుధీర్ఘ కాలం పనిచేసి.. రెండు రోజుల క్రితం బహిష్కరణకు గురైన బక్క జెడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీ ట్యాక్స్ అనేది ఆర్థిక శాఖకు సంబంధించిన వ్యవహారమని ఆయన బయటపెట్టారు. ఇందులో కొందరు ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పుకొచ్చారు. పూర్తిగా వారి చేతుల మీదుగానే లావాదేవీలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో ఇలా ఇంకా ఎన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి..? ఎన్ని పేర్లతో ట్యాక్స్ వసూళ్లు జరుగుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు "ఆర్, ఆర్" పేరుతో జరుగుతున్న ట్యాక్స్ వసూళ్లు ఎవరికి చేరుతున్నాయనే చర్చ కూడా జోరుగా నడుస్తోంది.

ఫీజుల నియంత్రణచట్టం ట్యాక్స్ బాపతేనా..?

ఇదే సందర్భంలో ప్రభుత్వం నుంచి మరో లీక్ వచ్చింది. రాష్ట్రంలో త్వరలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాబోతున్నట్టుగా ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే చట్టం చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులకు ఈ చట్టం ద్వారా ముకుతాడు వేస్తారని చెబుతున్నారు. కానీ ఇది కూడా ట్యాక్స్ వసూళ్లలో భాగంగా ఇచ్చిన లీక్ అని మరికొందరు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థల నుంచి "ట్యాక్స్ కలెక్షన్" కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఫార్మాసిటీ, ఎయిర్ పోర్ట్ మెట్రో వంటి వాటిపై సర్కారు యూటర్న్ తీసుకుంది. ఈ సమయంలోనూ భారీగానే వర్కౌట్ చేశారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ కార్యచరణలో భాగంగానే ఈ ప్రకటన చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Tags:
Next Story
Share it