Congress: వడ్లు కొన్న 2 రోజుల్లోపు ఖాతాల్లో డబ్బులు వేస్తాం !

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. పేద ప్రజల నుంచి ధనిక ప్రజల వరకు అందరూ ఇబ్బంది

Congress: వడ్లు కొన్న 2 రోజుల్లోపు ఖాతాల్లో డబ్బులు వేస్తాం !
X

Paddy: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయి. పేద ప్రజల నుంచి ధనిక ప్రజల వరకు అందరూ ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, కరెంటు కోతలు, ఆటో డ్రైవర్ల ఆందోళనలు, ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష సమస్యలు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం మారిన మూడు నెలల్లోనే చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

అయితే ఇలాంటి నేపథ్యంలో... తరచూ మాట తప్పే కాంగ్రెస్ ప్రభుత్వం... ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేసింది. వడ్లు కొన్న 2 రోజుల్లోపు ఖాతాల్లో డబ్బులు వేస్తాం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. యాసంగి ధాన్యం విక్రయాల్లో కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్.

ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. దీని కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో 56 చెకోపోస్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వరి కోతలు మొదలైన ప్రాంతాల్లో మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఏప్రిల్ 5 నాటికి అన్ని కేంద్రాలూ అందుబాటులోకి వస్తాయన్నారు పౌర సరఫరాల శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ డీఎస్ చౌహాన్. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ మాట అయినా నిలబెట్టుకుంటుందా లేదా చూడాలి.

Tags:
Next Story
Share it