Bakka Judson: రేవంత్ రెడ్డి దొంగ..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Bakka Judson: రేవంత్ రెడ్డి దొంగ..!
X

జనార్ధన్ రెడ్డి మీద చర్యలు ఎందుకు తీసుకోలే..?

రూ.7000 కోట్ల రైతుబంధు పైసలు ఎక్కడికి పోయినయ్

ఆర్థిక మంత్రి భట్టినా.? మెఘా కృష్ణారెడ్డి తమ్ముడా..?

"బీ ట్యాక్స్" ఇంచార్జ్ మెఘా కృష్ణారెడ్డి తమ్ముడే

బడే భాయ్ కి చోటే భాయ్ సద్దికడుతుండు

రాష్ట్రంలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిపించేందుకు..

మోడీతో రేవంత్ ఒప్పందం

త్వరలోనే కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తరు

కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణం, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడే భాయ్ కి చోటే భాయ్ సద్దికడుతున్నాడని.. రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేలా రేవంత్ రెడ్డి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెఘా కృష్ణారెడ్డి, మైహోంరామేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కనా..? మెగా కృష్ణారెడ్డి తమ్ముడా అని ప్రశ్నించారు. మెగా కృష్ణారెడ్డి తమ్ముడు స్లిప్ రాసిస్తేనే ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు బిల్లులు రిలీజ్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఆరోపించిన బీ ట్యాక్స్ స్లిప్ అదేనని అన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కోసం సిద్ధంచేసిన పెట్టిన రూ.7000 కోట్లు ఓ కార్పొరేట్ కంపెనీ అకౌంట్లోకి వెళ్లాయని.. ఆ వివరాలు బయటపెట్టారని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జడ్సన్ ప్రశ్నించారు. మరోవైపు.. మహబూబ్ నగర్ లో అమరరాజా కంపెనీకి అనుమతులపై ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులను వాడుకుని వదిలేశారని.. ఇప్పుడు 46 జీవో రద్దు గురించి మాట్లాడితేఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలు ఎవరూ ఉచిత పథకాలు అడగకున్నా.. ఆరు గ్యారంటీలు ప్రకటించి.. వాటిలో ఏ ఒక్కటి కూడా సరిగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. త్వరలోనే కాంగ్రెస్ ను ప్రజలు సస్పెండ్ చేస్తారని జోస్యం చెప్పారు.

Tags:
Next Story
Share it