Congress: డమ్మీ క్యాండిడేటూ..దొర్కుతలే..!

కరీంనగర్ లోక్ సభ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి.

Congress: డమ్మీ క్యాండిడేటూ..దొర్కుతలే..!
X

నెల రోజులుగా కొనసాగుతున్న వెతుకులాట

అత్యంత బలహీన అభ్యర్థి కోసం హస్తం ప్రయత్నాలు..!

40 రోజుల్లో ఎన్నికలు.. ఇంకా ఖరారు కాని అభ్యర్థి

ఇప్పటికీ మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం

హస్తం ప్రయత్నాలన్నీ సంజయ్ గెలుపుకోసమేనా.?

తెలంగాణం, కరీంనగర్ : కరీంనగర్ లోక్ సభ ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే ఉంది. అయినా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బండి సంజయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణలో బీజేపీ ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తిపై గెలవాలనే ఆసక్తి ఉంటే అంతకంటే బలమైన, ప్రజాధరణ ఉన్న నాయకుడిని ఎంపిక చేసి నిలబెట్టాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మాత్రం మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బలహీనమైన అభ్యర్థి కోసం, కొత్త ముఖాల కోసం వెతులాటలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కాస్తో కూస్తో ప్రజాధరణ ఉన్న నాయకులు పోటీచేసేందుకు సుముఖత వ్యక్తంచేసినా.. పార్టీ పెద్దలు ఒప్పుకోవడం లేదనే మాట వినిపిస్తోంది. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లోక్ సభ రేసులో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఆయన అభ్యర్థిత్వంపై ఆసక్తి కనబరిచినట్టు కనిపించలేదు. మరికొందరు సీనియర్లు, ప్రజల్లో ఉన్నవారు కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో వెలిచాల రాజేందర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన తండ్రి జగపతిరావు మాత్రం రాజకీయాల్లో ఉండేవారు. రాజేందర్ రావు పెద్దగా ప్రజల్లో ఉన్న నాయకుడు కూడా కాదని జిల్లాకు చెందిన కాంగ్రెస్ కేడరే అంటోంది. అయితే.. సీనియర్ నేతలు చాలా మంది టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. అధినాయకత్వం మాత్రం రాజేందర్ రావు వైపే మొగ్గు చూపుతోందని సమాచారం. కానీ ఆయన పేరు కూడా ఫైనల్ కాలేదని అంటున్నారు. సీనియర్ల లిస్ట్ ను పక్కనపెట్టేసి ఆయనతో పాటు మరికొందరు మండలస్థాయి, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకుల పేర్లను కూడా పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మరోవైపు.. మల్కాజ్ గిరిలో సునీతా లక్ష్మారెడ్డిని నిలబెట్టినట్టు.. కరీంనగర్ లో మరో నాన్ లోకల్ బలహీన అభ్యర్థిని పట్టుకొచ్చి నిలబెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో కేడర్ కూడా తీవ్ర కన్ఫ్యూజన్ లో ఉందని సమాచారం. ఎవరైనా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తారు. కానీ తమ పార్టీ మాత్రం ఓడిపోయే అభ్యర్థుల కోసం వెతుకుతోందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇదంతా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి పరోక్షంగా సహకరించేందుకేననే మాట కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని పెడితే.. ఆ ఓట్లను బీజేపీకి డైవర్ట్ చేసి సంజయ్ కి మేలు చేసేలా రాష్ట్ర పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే క్యాండిడేట్ ఎంత బలహీనమైన వ్యక్తి అయితే అంత మేలు అన్నట్టుగా చూస్తున్నారను ప్రచారం కూడా ఉంది.

Tags:
Next Story
Share it