Congress: రాజయ్యకు మొండి"చేయి"...!

ఎరక్కపోయి.. ఇరుక్కున్నట్లైంది స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పరిస్థితి.

Congress: రాజయ్యకు మొండిచేయి...!
X

ఢిల్లీకి పోయినా దేకని కాంగ్రెస్ పెద్దలు

అపాయింట్‌మెంట్ దొరక్క పడిగాపులు

చేర్చుకోవద్దంటున్న మహిళా నేతలు

ఏటూ తేల్చుకోలేక బిత్తరపోయిన రాజయ్య

తెలంగాణం, బ్యూరో : ఎరక్కపోయి.. ఇరుక్కున్నట్లైంది స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య పరిస్థితి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ లో చేరాలని భావించాడు. దీనికి ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఈ నెల 10న ఢిల్లీలో హస్తం పార్టీలో చేరుతున్నట్లు లీకులు ఇచ్చి వెళ్లాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. హస్తం పార్టీ నేతలు హ్యాండిచ్చారు. రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా మొహం చాటేశారు.

తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగినప్పటి నుంచి స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. శనివారం ఏకంగా నియోజకవర్గానికి చెందిన మహిళా కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ ముందు నిరసన తెలిపారు. రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో రాజయ్య పార్టీలోకి రావడాన్ని మొదట్లో స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి సైతం, పార్టీ నేతల ఒత్తిడితో సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నుంచి ఎవరూ సపోర్టు లేకపోవడంతో ఒంటరిగానే శనివారం ఢిల్లీ వెళ్లాడు రాజయ్య. అయితే అక్కడికి వెళ్లినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కనికరించలేదు.

కాంగ్రెస్ పార్టీ హ్యాండివ్వడంతో రాజయ్య ఏటు తేల్చుకోలేకపోతున్నాడు. తన గురించి మల్లిఖార్జున్ ఖర్గేకు 30 పేజీల లేఖ రాసినా ఎలాంటి రెస్బాన్స్ రాలేదు. అటూ కేసీ వేణుగోపాల్ కోసం వెయిట్ చేసినా ఫలితం లేకుండా పోయినట్లు తెలుస్తోంది. అయితే రాజయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మహిళలను వేదించేవాడని ఏకంగా ఓ మహిళా సర్పంచ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మహిళా నేతలు రాజయ్య చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Tags:
Next Story
Share it