Farmers: 'ఢిల్లీ ఛలో'పై ఆంక్షలు

ఛలో ఢిల్లీ’ పేరుతో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి.

Farmers: ఢిల్లీ ఛలోపై ఆంక్షలు
X

దేశరాజధాని సరిహద్దులు బంద్

రైతులు రాకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలు

ఎక్కడికక్కడ అడ్డుకోడానికి సిద్ధమైన ప్రభుత్వం

తెలంగాణం, ఇంటర్నెట్ డెస్క్: పంటలకు మద్దతు ధర సహా తమ డిమాండ్ల సాధన కోసం ఉత్తరాది రాష్ట్రాల్లోని అన్నదాతలు మంగళవారం ‘ఛలో ఢిల్లీ’ పేరుతో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) కల్పించే చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ, లఖీంపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో నెల రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మార్చి 12 వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఢిల్లీ సరిహద్దులు సింగు, ఘాజీపూర్, టిక్రి వద్ద 5,000 కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని సింఘూ సరిహద్దులో పెద్ద కంటైనర్లు, సిమెంట్, ఇనుప బారీకేడ్లు, వాటర్ కెనాన్స్ ను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో రైతులు బహిరంగ సభలను నిషేధిస్తూ పోలీసులు ఉత్వర్వులు జారీ చేశారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు అదనంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్రక్కులు, వాణిజ్య ప్రవేశాన్ని నిషేధించారు.

అటు పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఆ తర్వాత ఆర్‌ఏఎఫ్‌, మూడో అంచెలో పోలీసులు సాయుధ పోలీసుల బలగాలను మోహరించారు. పంజాబ్‌తో సరిహద్దును మూసివేయడమే కాకుండా లింక్‌రోడ్‌లోనూ పోలీసు సిబ్బందిని తరలించారు. ఇక, హర్యానాలోని పలు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెల్ సేవలను, బల్క్ మెసేజ్ లను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, ింద్ హాస్పార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.

Tags:
Next Story
Share it