New Delhi : కవిత బెయిల్ పై సంచలన తీర్పు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది.

New Delhi : కవిత బెయిల్ పై సంచలన తీర్పు!
X

న్యూస్ లైన్, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై తీర్పుని కోర్టు రిజర్వ్ చేసింది. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తీర్పు ఇస్తామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. కుమారుడికి పరీక్షలు ఉండడం తో కవిత మధ్యంతర బెయిల్ కావాలని కోర్టు వారిని కోరిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కవిత కోరిక ని తీవ్రంగా వ్యతిరేకించారు. పరీక్షల కోసం బెయిల్ అడగడం మానవతా కోణంలోకి రాదనీ, ఆమె కుమారుడిని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారని, ఇప్పటికే పలు పరీక్షలు కూడా అయిపోయాయని ఈడీ అధికారులు కోర్టుకి తెలిపారు. బెయిల్ ఇస్తే కవిత ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, లిక్కర్ కేసును ప్లాన్ చేసింది కవితనేనని, సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని బెదిరించారని, మేము అడిగిన ఏ ప్రశ్నకి కూడా ఆమె సమాధానం చెప్పలేదని, ఆమె మొబైల్ లో డేటా కూడా మొత్తం తొలగించి ఇచ్చిందని ఈడీ అధికారులు కోర్టు కి తెలిపారు.

Tags:
Next Story
Share it