BRS: నోముల భగత్ కుమార్ ఇంటి దగ్గర రచ్చ..సీజ్ చేస్తూ !

గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది. గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇల్లు సీజ్ చేశారు అధికారులు.

BRS: నోముల భగత్ కుమార్ ఇంటి దగ్గర రచ్చ..సీజ్ చేస్తూ !
X

Former MLA Nomula Bhagat Kumar: గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది. గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇల్లు సీజ్ చేశారు అధికారులు. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిని సీజ్ చేశారు అధికారులు. ఇక ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ నుంచి హాలియా మీదుగా నాగార్జునసాగర్ వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు.

రాజకీయ కక్ష సాధింపులు భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్ నాయకుల కావాలనే తన ఇల్లు సీజ్ చేశారని మండి పడ్డారు నోముల భగత్. అటు నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ క్యాంప్ కార్యాలయం సీజ్ పై జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన..స్పందించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మాత్రమే అమలు చేశాం....క్యాంపు కార్యాలయాన్ని రాజకీయ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు కాబట్టే సీజ్ చేశామని వివరించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు చెందిన క్వార్టర్ ను మాజీ ఎమ్మెల్యేకు క్యాంపు కార్యాలయంగా కేటాయించిందని... జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన వెల్లడించారు.

Tags:
Next Story
Share it