Gadari Kishore: డ్రగ్స్ కేసులో దొరికిన దొంగ కుందూరు రఘువీర్ రెడ్డి !

డ్రగ్స్ కేసులో కుందూరు రఘువీర్ రెడ్డి ఇరుక్కున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్

Gadari Kishore: డ్రగ్స్ కేసులో దొరికిన దొంగ కుందూరు రఘువీర్ రెడ్డి !
X

Gadari Kishore: డ్రగ్స్ కేసులో కుందూరు రఘువీర్ రెడ్డి ఇరుక్కున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో గ్యాదరి కిషోర్ మాట్లాడుతూ... కుందూరు రఘువీర్ రెడ్డి రాడిసన్ డ్రగ్స్ కేసులో దొరికితే కమిషనర్ మీద ప్రెషర్ పెట్టి రాత్రికి రాత్రి కేసులో రఘు చరణ్ అని పేరు మార్చారని బాంబ్‌ పేల్చారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి... రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారని వెల్లడించారు. వీళ్లని తీసుకొచ్చి ఒకరిని నల్గొండ నుండి ఒకరిని భువనగిరి నుంచి నిలబెట్టి మన మీద ఈ దొంగలను రుద్దాలని చూస్తున్నారన్నారు గ్యాదరి కిషోర్.

బీఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థులు మూడవ స్థానానికే పరిమితం అవుతారని తెలిపారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేశారు....ఇచ్చిన హామీలు అమలు చేస్తేనే కాంగ్రెస్ కు ఓటు వేయండని పేర్కొన్నారు. హామీలు అమలు కాకపోతే బీఆర్ఎస్ కు ఓటేయండని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే... బీఆర్ఎస్ గెలవాల్సిందేనని తెలిపారు.

Tags:
Next Story
Share it