Harish Rao : అసెంబ్లీ లో ఉత్తమ్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు - హరీష్ రావు

నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సభ మొత్తం అవాస్తవాలు చెప్పారని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డాడు.

Harish Rao : అసెంబ్లీ లో ఉత్తమ్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు - హరీష్ రావు
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు సభ మొత్తం అవాస్తవాలు చెప్పారని మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ప్రభుత్వం కేఆర్ఎంబీ తో చేసుకున్న ఒప్పందాలను నిరసిస్తూ తాము త్వరలోనే నల్గొండ లో ఒక సభ నిర్వహించాలని అనుకుంటున్నా ఈ నేపథ్యం లో, ప్రభుత్వం అసెంబ్లీ లో బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామం, ఇది కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విజయమే' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ '10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో ఎన్నడూ కూడా ప్రాజెక్టులను వేరే వాళ్లకు అప్పగించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు కూడా చేయించుకుంది. మేము దీనిని నిరసిస్తూ నల్గొండ లో సభ ని ఏర్పాటు చేస్తాము అనగానే కాంగ్రెస్ పార్టీ లో చలనం వచ్చింది..ఇది మా విజయం గా భావిస్తున్నాము. గోదావరి జలాల గురించి ఇటీవలే వీళ్ళు ఒక పుస్తకం ని విడుదల చేసారు. అందులో పూర్తిగా అవాస్తవాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అక్షరాలా 27 సార్లు గోదావరి జలాల గురించి లేఖలు రాసాము. కానీ ఒక్కసారి కూడా మేము రాయలేదు అన్నట్టుగా ఈ పుస్తకం లో చెప్పుకొచ్చారు' అంటూ హరీష్ రావు ఆరోపించాడు.


Tags:
Next Story
Share it