రేవంత్‌ కు నిద్ర లేకుండా చేస్తున్న హరీష్‌ రావు..మరో లేఖతో డెడ్‌ లైన్‌

రేవంత్‌ కు నిద్ర లేకుండా చేస్తున్నారు హరీష్‌ రావు. నిన్న నీళ్లు విడుదల చేయాలని హెచ్చరించిన హరీష్‌ రావు.. ఇవాళ రైతుల రుణమాఫీపై పోరాటం మొదలెట్టారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు

రేవంత్‌ కు నిద్ర లేకుండా చేస్తున్న హరీష్‌ రావు..మరో లేఖతో డెడ్‌ లైన్‌
X

Harish Rao: రేవంత్‌ కు నిద్ర లేకుండా చేస్తున్నారు హరీష్‌ రావు. నిన్న నీళ్లు విడుదల చేయాలని హెచ్చరించిన హరీష్‌ రావు.. ఇవాళ రైతుల రుణమాఫీపై పోరాటం మొదలెట్టారు. బ్యాంకుల నుంచి నోటీసులు, ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేస్తామని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులు కూడా మళ్లీ బ్యాంకులకు వెళ్లి 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోవాలని మీరే స్వయంగా పిలుపునిచ్చారని లేఖలో స్పష్టం చేశారు. మీ మాటను నమ్మి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. డిసెంబర్ 9 నాడు మీరు ప్రకటించినట్టుగా రుణమాఫీ జరగలేదని హెచ్చరించారు.

బ్యాంకులు మాత్రం రైతులకు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నాయి. ప్రభుత్వ హామీతో తమకు సంబంధం లేదని, తీసుకున్న అప్పుకు వడ్డీతో సహా కిస్తీలు చెల్లించి తీరాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. రుణమాఫీ విషయంలో మీరు తక్షణం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని ఎప్పట్లోగా చేస్తారో స్పష్టమైన తేది ప్రకటించాలని రైతుల పక్షాన కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు.

Tags:
Next Story
Share it