Harish Rao: మేడిగడ్డకు వెళ్లి గలగలా పారుతున్న వాగులు, పొలాలు చూడండి

మేడిగడ్డకు వెళ్లి గలగలా పారుతున్న వాగులు, పంట పొలాలు చూడండని సీఎం రేవంత్‌ రెడ్డికి (revanth reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మాజీ హరీష్ రావు (Harish Rao).

Harish Rao: మేడిగడ్డకు వెళ్లి గలగలా పారుతున్న వాగులు, పొలాలు చూడండి
X

Harish Rao: మేడిగడ్డకు వెళ్లి గలగలా పారుతున్న వాగులు, పంట పొలాలు చూడండని సీఎం రేవంత్‌ రెడ్డికి (revanth reddy) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు మాజీ హరీష్ రావు (Harish Rao). మేడిగడ్డకు వెళ్తున్న సీఎం, మంత్రులు మధ్యలో రంగ నాయక్ సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, గలగలా పారుతున్న కూడవెల్లి వాగును కూడా చూడండని కోరారు హరీష్ రావు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ ప్రాజెక్ట్‌ (medigadda project) సందర్శన ఉందన్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు బస్సులో అసెంబ్లీ నుంచి బయల్దేరింది సీఎం రేవంత్‌ బృందం. అయితే.. దీనిపై హరీష్‌ రావు (Harish Rao) స్పందించారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని చురకలు అంటించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటి కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల ఉపయోగం...

వీటన్నింటి సమాహారం కాళేశ్వరం అని వ్యాఖ్యనించారు. ఒక బ్యారేజీలో ఒకటి రెండు కుంగి పోతే కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఫైర్‌ అయ్యారు. మీరు వెళ్ళే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడండన్నారు. మేడిగడ్డ మీద ఎంక్వయిరీ వేయండి, కఠిన చర్యలు తీసుకోండి.. కానీ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టకండని కోరారు హరీష్ రావు(Harish Rao).

Tags:
Next Story
Share it