Harish Rao: కాంగ్రెస్ తప్పులను మురళీధర్ రావుపై వేస్తున్నారు

కాంగ్రెస్ తప్పులను మురళీధర్ రావుపై వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కేఆర్‌ఎంబీ ఇష్యూపై వాస్తవాలు మాట్లాడితే అధికారి మురళీధర్ రావు మీద నెపం

Harish Rao: కాంగ్రెస్ తప్పులను మురళీధర్ రావుపై వేస్తున్నారు
X

Harish Rao: కాంగ్రెస్ తప్పులను మురళీధర్ రావుపై వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కేఆర్‌ఎంబీ ఇష్యూపై వాస్తవాలు మాట్లాడితే అధికారి మురళీధర్ రావు మీద నెపం మోపి తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు. క్షమాపణ చెప్పి..కేఆర్‌ఎంబీపై తీర్మానం చేస్తే స్వాగతిస్తామన్నారు. నదిజలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని, అది తేలేవరకు నీటి పంపకాలు జరగవని కేసీఆర్ అప్పట్లోనే స్పష్టం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

'ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడు కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టులను అప్పగించింది. ఆపరేషనల్ ప్రోటోకాల్ కు ఒప్పుకోబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది' అని వివరించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్ వాళ్ళది కుడితిలో పడ్డ ఎలుక లెక్క ఉందని...స్మితా సబర్వాల్ లేఖ సగమే చదివి వదిలేస్తున్నారని ఆగ్రహించారు. ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై స్మితా సబర్వాల్.. రాహుల్ బొజ్జ రాసింది ఒక్కటే లేఖ అన్నారు హరీష్‌ రావు.

Tags:
Next Story
Share it