IPS : తెలంగాణాలో భారీగా ఐపీఎస్ బదిలీలు!

తెలంగాణా ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. 12 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

IPS : తెలంగాణాలో భారీగా ఐపీఎస్ బదిలీలు!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : తెలంగాణా ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్ లను బదిలీ చేసింది. 12 మంది ఐపీఎస్ లను బదిలీ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో కొంతమంది ఐపీఎస్ లను చూస్తే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బదిలీ అయ్యాడు. అలాగే ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా అపూర్వరావు,.సౌత్ వెస్ట్ డీసీపీ గా ఉదయ్ కుమార్ రెడ్డి,పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా మురళీధర్, హైదరాబాద్ మల్టీజోన్ ఐజీ గా సుధీర్ బాబు,రాచకొండ సీపీ గా తరుణ్ జోషి, రామగుండం సీపీగా శ్రీనివాసులు బదిలీ అయ్యినట్టు తెలుస్తుంది.కేవలం ఐపీఎస్ లను మాత్రమే కాదు, 110 డీఎస్పీ లను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇలా ఒక్కసారిగా పోలీస్ శాఖలో భారీ గా బదిలీలు జరగడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక శాతం జంటనగరాల్లోనే బదిలీలు జరిగినట్టు తెలుస్తుంది.

Tags:
Next Story
Share it