Telangana: ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు

తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు

Telangana: ఉద్యోగ పరీక్షల వయోపరిమితి పెంపు
X

Telangana: తెలంగాణలోని కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇక అటు కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. కేఆర్‌ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తే లేదని తీర్మానం చేస్తున్నామన్నారు. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తీరుతో నష్టం జరిగిందని వివరించారు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని తెలిపారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Tags:
Next Story
Share it