Kadium Srihari: ఇవాళ్టి నుంచి తెలంగాణలో జలయజ్ఞం మొదలైంది

ఇవాళ్టి నుంచి తెలంగాణలో జలయజ్ఞం మొదలైందని తెలిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadium Srihari). చలో నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు,

Kadium Srihari: ఇవాళ్టి నుంచి తెలంగాణలో జలయజ్ఞం మొదలైంది
X

Kadium Srihari: ఇవాళ్టి నుంచి తెలంగాణలో జలయజ్ఞం మొదలైందని తెలిపారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadium Srihari). చలో నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ...పార్టీ నేతలంతా నల్గొండ సభకు వెళ్తున్నామన్నారు. కృష్ణా నది కింద ఉన్న ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB)కు అప్పగించటం మంచిది కాదు.

ఈ ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB)కు వెళ్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. కరెంట్ కు కూడా ఇబ్బందులు ఎదురు అవుతాయన్నారు. వారం కిందనే మేము నల్గొండ సభ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు..ఇది చూసిన కాంగ్రెస్... భయపడి నిన్న సభలో తీర్మానం చేసిందని చురకలు అంటించారు.

మా సభ నుంచి దృష్టి మరల్చేందుకు ఇవాళ ప్రభుత్వం మేడిగడ్డకు వెళ్తోంది.. కృష్ణా నదిపై ఉన్న హక్కులు కాపాడేందుకు బీఆర్ఎస్ సిద్దంగా ఉందన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని నల్గొండ సభకు వెళ్తున్నాం..పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు, రైతులు వస్తున్నారన్నారు. ఇవాళ్టి నుంచి జల యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు కడియం శ్రీహరి (Kadium Srihari).

Tags:
Next Story
Share it