Karimnagar : అభివృద్దే నా లక్ష్యం....కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెస్తా - వినోద్ కుమార్

నేడు హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Karimnagar : అభివృద్దే నా లక్ష్యం....కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా నిధులు తెస్తా - వినోద్ కుమార్
X

న్యూస్ లైన్, హుజురాబాద్: నేడు హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తో కలిసి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో వినోద్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ వెయ్యి కోట్ల రూపాయలతో కరీంనగర్ ని స్మార్ట్ సిటీ గ అభివృద్ధి చేసిన ఘనత తనదే అని, బీజేపీ కేంద్రం లో అధికారం లో ఉన్నప్పటికీ, బండి సంజయ్ బీజేపీ ఎంపీ గా కరీంనగర్ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాల్సిందిగా వినోద్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్ కి రైల్వే స్టేషన్ ని తెచ్చిన ఘనత తనదేనని, జాతీయ రహదారుల కోసం పార్లమెంట్ తన గళం బలంగా ఎత్తి, రహదారులను నిర్మించానని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

కరీంనగర్ లో ట్రిబుల్ ఐటీ కోసం 50 ఎకరాల స్థలం కేటాయించిన కూడా కర్ణాటకకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. తనని మే 13 వ తారీఖున జరిగే ఎంపీ ఎన్నికలలో గెలిపిస్తే కరీంనగర్ ని విద్యా హబ్ హా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 5 ఏళ్ళు ఎంపీ గా బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారు, ఆయనకీ అభివృద్ధి చెయ్యడం చేతకాకనే అడ్డగోలుగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. 5 ఏళ్లలో ఇప్పటి వరకు ఆయన ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయలేకపోయారు. నన్ను ప్రజలు ఆశీర్వదించి ఎంపీ గా గెలిపిస్తే మునుపెన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Tags:
Next Story
Share it