KCR : ఆ రోజు జరిగింది అదే: కేసీఆర్

రాష్ట్ర ఏర్పాటుకు ముందు కృష్ణా జలాల పంపకంపై జరిగిన విషయాలను నల్లగొండ సభలో తెలిపారు కేసీఆర్.

KCR : ఆ రోజు జరిగింది అదే: కేసీఆర్
X

న్యూస్ లైన్, నల్లగొండ: రాష్ట్ర ఏర్పాటుకు ముందు కృష్ణా జలాల పంపకంపై జరిగిన విషయాలను నల్లగొండ సభలో తెలిపారు కేసీఆర్. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలకు సంబంధించి ఒక ఏడాది వరకు సర్దుబాటు చేస్తామని చెప్పిందన్నారు. ఆ తర్వాత నీటి పంపాలు ఉంటాయని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందన్నారు. ఆ సమయంలో తెలంగాణ ఏర్పాటు కావాలని, ఒక్క ఏడాదే కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిందని, బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

బీజేపీ ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జలాల నీటి వాటా తేల్చాలని వందల లేఖలు రాసినట్లు చెప్పారు కేసీఆర్. ట్రిబ్యునల్ వేయాలని కోరినట్లు చెప్పారు. కానీ పట్టించుకోలేదన్నారు. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లినా ట్రిబ్యునల్ వేయాలేదన్నారు. సీఎంగా తానే ఒకసారి మీటింగ్ కు వెళ్లి నిలదీశానని, అయితే సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని చెప్పారని, దీంతో కేసు విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. అయినా కానీ బీజేపీ మాత్రం ట్రిబ్యునల్ వేయలేదన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడి, ఒత్తిడి పెంచడంతో ఎన్నిలకు 4 నెలలు ముందు ట్రిబ్యునల్ వేశారని తెలిపారు కేసీఆర్.

Tags:
Next Story
Share it