KCR : మొగోడు చేయాల్సిన పని అది.. ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్...!

రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు మన బాధలు చెప్పి, కొట్లాడి మన వాటా సాధించాలని, అది మొగోడు చేయాల్సిన పని అంటూ మండిపడ్డారు కేసీఆర్.

KCR : మొగోడు చేయాల్సిన పని అది.. ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్...!
X

న్యూస్ లైన్, నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు మన బాధలు చెప్పి, కొట్లాడి మన వాటా సాధించాలని, అది మొగోడు చేయాల్సిన పని అంటూ మండిపడ్డారు కేసీఆర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. 5 జిల్లాల ప్రజల జీవన్మరణ సమస్య అయినా కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల గురించి మాట్లాడలేని మంత్రులంతా సోయి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉందని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శమన్నారు. వేలాది మంది ప్రాణాలు త్యాగం చేసి, లక్షలాది మంది కోట్లాడి సాధించిన తెలంగాణ అంటే ఉత్తమ్ కుమార్ కు నచ్చడం లేదంటున్నారన్నారు.

Tags:
Next Story
Share it